ఆపదలో ఉన్న ఓ ఎనిమిదేళ్ల బాలికను సమయస్ఫూర్తితో రక్షించిన యువకుడు మహ్మద్ ఫిరోజ్‌ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్, ఐపీఎస్ అభినందించారు.
సోమవారం బషీర్‌బాగ్‌లోని పాత సీపీ కార్యాలయంలో ఫిరోజ్‌ను శాలువాతో సత్కరించి, ప్రశంసా పత్రం మరియు నగదు బహుమతిని అందజేశారు.
ఈ నెల 1న అబిడ్స్ ప్రాంతంలో స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్న బాలికను ఆటో డ్రైవర్ సలీం మాయమాటలతో ఆటోలోకి ఎక్కించి గోల్కొండ ప్రాంతానికి తీసుకెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించాడు.
ఈ సమయంలో అక్కడికి వచ్చిన ఫిరోజ్ ఆటోలో చిన్నారి ఏడుస్తుండటాన్ని గమనించి వెంటనే అడ్డుకున్నారు. బాలిక పరిస్థితిని తెలుసుకుని నిందితుడిని ప్రశ్నించగా, అతడు అక్కడి నుంచి పరారయ్యాడు.
ఫిరోజ్ వెంటనే బాలిక ఐడీ కార్డు ఆధారంగా ఆమె తండ్రికి సమాచారం ఇచ్చాడు. అనంతరం అబిడ్స్ పీఎస్‌కు చెందిన బ్లూ కోట్స్ కానిస్టేబుళ్లు సాయికృష్ణ, కేదార్ సింగ్ సంఘటన స్థలానికి చేరుకుని బాలికను సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు.
ఈ కేసులో నిందితుడు సలీంను పోలీసులు ఏప్రిల్ 2న అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
ఈ సందర్భంగా సీపీ సజ్జనర్ మాట్లాడుతూ, సమాజంలో ప్రతి ఒక్కరూ ఇలాంటి సమయస్ఫూర్తి, బాధ్యత చూపాలని సూచించారు. అలాగే కానిస్టేబుళ్లు సాయికృష్ణ, కేదార్ సింగ్ సేవలను కూడా అభినందించారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments