ePaper
Monday, March 16, 2026

ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2025: బంగ్లాదేశ్ ఘన విజయం

ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ 2025లో బంగ్లాదేశ్ జట్టు తమ తొలి మ్యాచ్‌లోనే పాకిస్తాన్‌పై 7 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని సాధించింది.

కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ జట్టు, బంగ్లాదేశ్ బౌలర్ల ధాటికి తట్టుకోలేక 38.3 ఓవర్లలో కేవలం 129 పరుగులకే ఆలౌట్ అయింది. బంగ్లాదేశ్ తరపున షోర్నా అక్తర్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి 5 పరుగులకు 3 వికెట్లు పడగొట్టింది.

చిన్న లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లాదేశ్ త్వరగానే ఒక వికెట్ కోల్పోయినప్పటికీ, ఆరంగేట్రం చేసిన రుబ్యా హైదర్ అద్భుతమైన బ్యాటింగ్‌తో జట్టును విజయం వైపు నడిపించింది. ఆమె 54 పరుగులతో నాటౌట్‌గా నిలిచి, కెప్టెన్ నిగర్ సుల్తానా (23) తో కలిసి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. బంగ్లాదేశ్ జట్టు 31.1 ఓవర్లలో కేవలం 3 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసి విజయదుందుభి మోగించింది.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!