నల్గొండలో రాష్ట్ర రోడ్లు & భవనాల శాఖ మంత్రి Komatireddy Venkat Reddy గారిని నల్గొండ తొలి మేయర్ Burri Chaitanya Srinivas Reddy మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ భేటీలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గుమ్ముల మోహన్ రెడ్డి, కార్పొరేటర్లు శ్రీ బోయినపల్లి వేదస్రీ శ్రీనివాస్, శ్రీ అలకుంట్ల నాగరత్నం రాజు పాల్గొన్నారు.

అలాగే నల్గొండ మున్నూరు కాపు జిల్లా ప్రతినిధులు, మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహ ట్రస్ట్ సభ్యులు, పట్టణ కమిటీ సభ్యులు మరియు కుల పెద్దలు హాజరై మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు.
జిల్లా అభివృద్ధి కార్యక్రమాలు, వసతి గృహాల పురోగతి, సామాజిక సంక్షేమ అంశాలపై చర్చించినట్లు నాయకులు తెలిపారు.
ఈ భేటీతో నల్గొండ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments