నల్లగొండ: రాష్ట్ర బీసీ సంఘాల జేఏసీ పిలుపు మేరకు అక్టోబర్ 18, 2025న జరగనున్న తెలంగాణ బంద్‌ను విజయవంతం చేయడానికి నల్లగొండలోని ఎస్‌బీఆర్ ఫంక్షన్ హాల్‌లో బీసీ సంఘాల సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చక్ర హరి రామరాజు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు దుడుకు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, జనాభాలో 60 శాతం ఉన్న బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్న ప్రభుత్వ జీవో–9ను అడ్డుకోవడం తీవ్ర అన్యాయమని తెలిపారు. జీవో అమలు పూర్తయ్యే వరకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకూడదని డిమాండ్ చేశారు.
బంద్‌ను విజయవంతం చేయడానికి జిల్లాలోని అన్ని విద్యాసంస్థలు, వ్యాపార సంస్థలు, రవాణా మరియు ప్రభుత్వ కార్యాలయాలు పూర్తిగా మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్ 17న సాయంత్రం 3 గంటలకు నల్లగొండ పట్టణంలో భారీ సైకిల్ ర్యాలీ నిర్వహించి బంద్‌పై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. సమావేశంలో కంది సూర్యనారాయణ, నేలపట్ల సత్యనారాయణ, మిర్యాల యాదగిరి, కేశబోయిన శంకర్ ముదిరాజ్, నల్ల సో మల్లన్న, చీర పంకజ్ యాదవ్, నకిరేకంటి కాశయ్య గౌడ్, పిల్లి రామరాజు, గండి చెరువు వెంకన్న, చిలుక రాజు సతీష్, చిలక రాజ్ చెన్నయ్య, వైద్యుల సత్యనారాయణ తదితరులు పాల్గొని బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments