హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో తిరుమలగిరి సాగర్ మండలం ఎర్రచెరువు తండాకు చెందిన రమావత్ అంజి నాయక్‌ను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ నల్గొండ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బుధవారం పార్టీ నియమించింది.

ఈ నియామక పత్రాన్ని తెలంగాణ కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు టీ. శ్రవణ్ కుమార్ చేతుల మీదుగా రమావత్ అంజి నాయక్ స్వీకరించారు.

ఈ సందర్భంగా రమావత్ అంజి నాయక్ మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు చి. మధు, జేడీ నాయక్, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments