ePaper
Sunday, March 15, 2026

జైలు జీవితం తర్వాత సమాజానికి సేవ చేయాలని ఖైదీలకు కలెక్టర్ సూచన

నల్గొండ:

జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఖైదీలకు ప్రేరణాత్మక సూచనలు చేశారు. గాంధీ జయంతి సందర్భంగా గురువారం జిల్లా జైలులో నిర్వహించిన ఖైదీల సంక్షేమ దినోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్య సంగ్రామంలో మహాత్మా గాంధీ అనేకసార్లు జైలుశిక్షను అనుభవించారని, సత్యాగ్రహం ద్వారా స్వాతంత్ర్యాన్ని సాధించిన గాంధీజీ కృషి గురించి పదిమందికి చాటి చెప్పాలని కోరారు.

ఖైదీలు జైలు జీవితాన్ని ఒక అనుభవంగా, ప్రేరణగా తీసుకొని విడుదల తర్వాత సమాజంలో మళ్ళీ అడుగుపెట్టినప్పుడు ఇతరులకు సహాయం చేసే విధంగా మెలగాలని ఆమె పిలుపునిచ్చారు. జైలులో సమయాన్ని వృథా చేయకుండా లైబ్రరీలోని పుస్తకాలు చదివి ఆలోచన శక్తిని పెంపొందించుకోవాలని సూచించారు.

ఏదైనా నేర్చుకోవాలన్న పట్టుదలతో కష్టపడే మనస్తత్వాన్ని అలవాటు చేసుకోవాలని, చిన్నప్పుడు కష్టపడితే పెద్దయ్యాక సుఖంగా జీవించవచ్చని, వయసు పెరుగుతున్నకొద్దీ బాధ్యతలు కూడా పెరుగుతాయని కలెక్టర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, ఆర్డీవో వై. అశోక్ రెడ్డి, జిల్లా జైలర్ ప్రమోద్, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

గాంధీ జయంతి వేడుకలలో భాగంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్‌లు రామగిరిలోని గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ ఆర్డీవో వై. అశోక్ రెడ్డి హాజరయ్యారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!