నల్గొండ నగరంలోని 33వ డివిజన్ మీర్‌బాగ్ కాలనీ (రోడ్ నం.2)లో ఫహీమ్ భాయ్ ఏర్పాటు చేసిన ‘దావత్-ఏ-ఇఫ్తార్’ వేడుక ఘనంగా జరిగింది. అయితే హోలీ పండుగ సందర్భంగా మున్సిపాలిటీకి సెలవు ఉండటంతో ఆ ప్రాంతంలో పారిశుధ్య పనులు ఆగిపోయాయి.
దీనిని గమనించిన 33వ డివిజన్ కాంటెస్టెడ్ కార్పొరేటర్, సెక్యులర్ లీడర్ ఎండీ. అజహరుద్దీన్ గారు కేవలం నాయకుడిలా కాకుండా బాధ్యత గల పౌరుడిలా స్పందించారు. తన టీమ్ సభ్యులతో కలిసి స్వయంగా చీపురు పట్టి పార్టీ జరిగిన ప్రాంతాన్ని పూర్తిగా శుభ్రం చేశారు.
ఈ సేవా కార్యక్రమంలో సయ్యద్ లతీఫ్ (అమ్ము), ముబీన్, అవాజ్, రహీమ్ పాల్గొన్నారు.
పదవులు ముఖ్యం కాదని, ప్రజల సౌకర్యం మరియు పరిసరాల పరిశుభ్రత ముఖ్యమని నిరూపించిన అజహరుద్దీన్ గారిని మరియు వారి టీమ్‌ను కాలనీ వాసులు అభినందించారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments