Home

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎన్నికలలో గెలుపొందిన మాజీ కౌన్సిలర్ మిర్యాల యాదగిరి గారికి సన్మానం*

ఇటీవల జరిగిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎన్నికలలో యం.సీ మెంబెర్ గా గెలుపొందిన మాజీ కౌన్సిలర్ మిర్యాల యాదగిరి గారికి పౌర సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా బీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు *గంజి రాజేందర్, చెరిపెల్లి జయప్రకాష్* మాట్లాడుతూ నిరాడంబరుడు, ప్రజా సేవలో నిరంతరం కృషి చేస్తున్న మిర్యాల యాదగిరి గారు గెలుపొందడం సంతోషకరం అని, అనేక సేవా కార్యక్రమాలు చేయుచూ పేద వారికి అండగా నిలబడుతున్న యాదగిరి గారి స్ఫూర్తితో యువత ముందుకు వచ్చి ఆపదలో అవసరం...

దుర్గామాతను దర్శించుకున్న నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సతీమ రామాదేవి..

చందు యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండపంలో ప్రత్యేక పూజలు.._ _నల్లగొండలోని చందనగిరి విల్లాస్‌లో చందు యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాన్ని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి సతీమణి రామాదేవి సందర్శించారు.._ _ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.._ _దుర్గామాత మండపానికి చేరుకున్న రామాదేవికి నిర్వాహకులు స్వాగతం పలికారు.._ _అనంతరం అమ్మవారిని దర్శించుకుని భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. దుర్గామాత ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు.._ _చందనగిరి విల్లాస్‌లో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపం వద్ద నిర్వహిస్తున్న పూజా కార్యక్రమాల్లో...

జిల్లా విజిలెన్స్‌ కమిటీలో ఎడుదొడ్ల వెంకటరామరెడ్డికి చో

నల్గొండలో ఘన సన్మానం.. పలువురు ప్రముఖుల అభినందన చీకటి వెలుగు – నల్గొండ: నల్గొండ జిల్లా స్థాయి విజిలెన్స్‌, పర్యవేక్షణ కమిటీ సభ్యుడిగా ఎడుదొడ్ల వెంకటరామరెడ్డి నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయనను టీఎన్జీవోస్‌ జిల్లా అధ్యక్షుడు నాగిల్ల మురళి, ఎస్సీ సంక్షేమ శాఖ జిల్లా ఉపసంచాలకురాలు శశికళ ఘనంగా సన్మానించి అభినందించారు. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రోత్సాహంతో ఈ నియామకం జరిగినట్లు తెలిపారు. నల్గొండ జిల్లా కలెక్టర్‌ కార్యాలయం జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ నంబర్‌ A4/1412/2016, తేదీ 15-10-2026...

బీఆర్ఎస్ ప్రభుత్వంలో అక్రమాలు, స్కాములు చేసిన చరిత్ర మీది - సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సూర దేవరాజు

సిరిసిల్ల టౌన్, ప్రజాతంత్ర, అక్టోబర్ 17:ప్రజల సొమ్మును దోచుకొని అవినీతి అక్రమాలకు పాల్పడిన డబ్బుతో ఫామ్‌హౌస్‌లు, హోటళ్లు, భూములు కొనుగోలు చేయడంతో పాటు భార్యలు, పిల్లల పేర్ల మీద ఆస్తులు కూడబెట్టుకోవడంపై దృష్టి పెట్టారని ఆరోపించారు. ప్రజా సమస్యలు, రైతుల సంక్షేమాన్ని పట్టించుకోలేదని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సూర దేవరాజు విమర్శించారు. ప్రెస్ క్లబ్‌లో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. 2014, 2015 సంవత్సరాల్లో ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు, నీటి లభ్యత తగ్గే పరిస్థితులు ఉన్నప్పటికీ...

కుక్కడంలో ఎక్స్‌ప్రెస్‌ బస్సులు ఆపాలి! ప్రభుత్వ ఉద్యోగులు, మహిళా ఉపాధ్యాయుల ఇబ్బందులు తొలగించాలి ప్రైవేటు వాహనాలపై ఆధారపడుతున్న ఉద్యోగులు.. ప్రమాదాల బారిన పడుతున్న ప్రయాణికులు

కుక్కడం: మాడ్లపల్లి మండలం కుక్కడం గ్రామంలో ఉదయం వేళ ఎక్స్‌ప్రెస్‌ బస్సులు ఆపాలని గ్రామస్థులు, ఉపాధ్యాయులు ఆర్టీసీ అధికారులను కోరుతున్నారు. గ్రామంలో ప్రభుత్వ విద్యాసంస్థలు, రెసిడెన్షియల్‌ పాఠశాలలు, కళాశాలలతో పాటు పలు ప్రభుత్వ కార్యాలయాలు, రైల్వే స్టేషన్‌ ఉన్నప్పటికీ ఉదయం వేళ ఎక్స్‌ప్రెస్‌ బస్సులు నిలపకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు పేర్కొంటున్నారు. ప్రత్యేకించి ప్రభుత్వ విద్యాసంస్థల్లో పనిచేసే మహిళా ఉపాధ్యాయులు, ఉద్యోగులు సమయానికి విధులకు చేరుకోవడానికి నానా అవస్థలు పడుతున్నారు. ఉద్యోగులకు ఎఫ్‌ఆర్‌ఎస్‌ (ఫేషియల్‌ రికగ్నిషన్‌ సిస్టమ్‌) హాజరు తప్పనిసరి కావడంతో...

అరకొర వసతులతో తూ తూ మంత్రంగా. కార్పొరేషన్ అయి మొదటి .బతుకమ్మ వేడుకల్లో అరకొర ఏర్పాట్లు..

చీకటి వెలుగు నల్లగొండ. విద్యుత్ లైట్లు,తాగునీరు లేదు.. సౌండ్ బాక్సులు లేవు.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ నిర్వహణలో నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల తీరు ప్రశ్నార్థకంగా మారిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా వేడుకల ఏర్పాట్ల బాధ్యతల్లో కీలక పాత్ర పోషించాల్సిన మున్సిపల్ అధికారులు పర్యవేక్షణపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నాగార్జున ప్రభుత్వ కళాశాల మైదానంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించేందుకు అక్కడికి వచ్చే మహిళలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో ఎందుకు నిర్లక్ష్యం జరిగిందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తాగునీటి సౌకర్యం లేకపోవడం, బతుకమ్మ...

యాసంగిలో వరి సాగు చేయవద్దు* ఎల్‌నినో ప్రభావంతో నీటి కొరత.. రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి

చీకటి వెలుగు నల్లగొండ. ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు యాసంగిలో ఎట్టి పరిస్థితుల్లోనూ వరి సాగు చేయవద్దని రాష్ట్ర కార్మిక, ఉపాధి,శిక్షణ శాఖల కార్యదర్శి, ఉమ్మడి నల్గొండ జిల్లా ఎల్‌నినో ప్రత్యేక అధికారి దాసరి హరిచందన సూచించారు.శుక్రవారం కనగల్ మండలం శేరిలింగోటం గ్రామంలో నీరు లేక ఎండిపోయిన వరి,పత్తి పొలాలను ఆమె పరిశీలించారు. అనంతరం రైతులతో మాట్లాడి పంటల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు సరిగా కురవకపోవచ్చని వ్యవసాయ అధికారులు, జిల్లా యంత్రాంగం ముందుగానే హెచ్చరించినప్పటికీ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వరి...

పెన్షనర్ల బకాయిలు ఒకేసారి చెల్లించాలి దసరా, దీపావళి తర్వాత ‘చలో హైదరాబాద్‌’కు పిలుపు టీఎస్‌జీఆర్ఈఏ రాష్ట్ర అధ్యక్షుడు పేరి వెంకట్‌రెడ్డి

చీకటి వెలుగు నల్లగొండ. ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎస్‌)లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంతోపాటు, పెన్షనర్లకు రావాల్సిన పీఆర్సీ ప్రయోజనాలు, ఇతర బకాయిలను సాధించేందుకు కృషి చేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (టీఎస్‌జీఆర్ఈఏ) రాష్ట్ర అధ్యక్షుడు పేరి వెంకట్‌రెడ్డి తెలిపారు. నల్లగొండలోని జిల్లా పెన్షనర్ల సామాజిక సేవా భవన్‌లో శుక్రవారం జిల్లా అధ్యక్షుడు జి.వెంకట్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వైద్య సేవల్లో ఇబ్బందులు తొలగించాలి: ఉద్యోగుల వేతనాల నుంచి 1.5 శాతం మినహాయించి అమలు చేస్తున్న ఈహెచ్‌ఎస్‌ ద్వారా కుటుంబ...

చౌటుప్పల్‌లో అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాహనం పట్టివేత అక్రమ ఇసుక రవాణాపై మున్సిపల్ సిబ్బంది చర్యలు

చౌటుప్పల్: పట్టణంలో అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న వాహనాన్ని మున్సిపల్ సిబ్బంది పట్టుకున్నారు. అక్టోబర్ 16న ఈ ఘటన చోటుచేసుకుంది. ఇసుక రవాణా నిబంధనలను ఉల్లంఘిస్తూ అనుమతులు లేకుండా తరలింపులు చేపడుతున్నారనే నేపథ్యంలో మున్సిపల్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఇసుకను అక్రమంగా తరలించడం వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడటమే కాకుండా, నిబంధనల అమలుపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇసుక రవాణా చేసే వాహనదారులు తప్పనిసరిగా సంబంధిత అనుమతులు కలిగి ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అనుమతులు లేకుండా ఇసుక తరలించే...

అరకొర వసతులతో తూ తూ మంత్రంగా. కార్పొరేషన్ అయి మొదటి .బతుకమ్మ వేడుకల్లో అరకొర ఏర్పాట్లు..

చీకటి వెలుగు నల్లగొండ. విద్యుత్ లైట్లు,తాగునీరు లేదు.. సౌండ్ బాక్సులు లేవు.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ నిర్వహణలో నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల తీరు ప్రశ్నార్థకంగా మారిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా వేడుకల ఏర్పాట్ల బాధ్యతల్లో కీలక పాత్ర పోషించాల్సిన మున్సిపల్ అధికారులు పర్యవేక్షణపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నాగార్జున ప్రభుత్వ కళాశాల మైదానంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించేందుకు అక్కడికి వచ్చే మహిళలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో ఎందుకు నిర్లక్ష్యం జరిగిందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తాగునీటి సౌకర్యం లేకపోవడం, బతుకమ్మ...

రత్నకిరీట ధగధగలు.. లలిత త్రిపుర సుందరీగా దుర్గామాత దర్శనం

కనగల్ మండలం దర్వేశిపురం గ్రామంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు దుర్గామాత అమ్మవారు శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. రంగురంగుల పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలు, రత్నకిరీటంతో అమ్మవారిని సుందరంగా అలంకరించారు. పుష్పమాలలు, వివిధ ఆయుధాలు, దైవిక చిహ్నాలతో అమ్మవారి అలంకరణ భక్తులను ఆకట్టుకుంది. ఆలయ ముఖ్య అర్చకులు నాగోజు మల్లాచారి వేదమంత్రాల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు. భవాని మాలధారణ చేసిన భక్తులతో పాటు పలువురు భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు....

శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవిగా ధర్వేశిపురం యల్లమ్మదేవి

శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఐదవ రోజు కనగల్ మండలం ధర్వేశిపురం (పర్వతగిరి)లోని శ్రీ యల్లమ్మ అమ్మవారు శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు.ఆలయ ముఖ్య అర్చకులు నాగోజు మల్లాచార్య,చిలకమర్రి శ్రవణ్ కుమార్ ఆచార్యుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి పూజలు నిర్వహించారు.శ్రీ చక్ర అధిష్ఠాన శక్తిగా,పంచదశాక్షరీ మహామంత్ర దేవతగా కొలువైన అమ్మవారు చెరుకు గడను చేతబూని,ఇరువైపులా శ్రీ లక్ష్మీదేవి,శ్రీ సరస్వతీదేవిల సేవలందుకుంటున్న దివ్యరూపంలో దర్శనమిచ్చారు.ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ అంబటి నాగిరెడ్డి,అర్చకులు గాదె దామోదర్ రావు,గాదె ఉమామహేశ్వరరావు, సీహెచ్. అవ్యయ్...

నల్లగొండలో అక్టోబర్ 17న ‘దాండియా ధమాకా’ వేడుకలు

నల్లగొండలో నెక్స్జెన్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో ‘దాండియా ధమాకా’ వేడుకలను అక్టోబర్ 17, 2026న నిర్వహించనున్నారు. శనివారం సాయంత్రం 5 గంటల నుంచి బండారు గార్డెన్స్ ఏసీ ఫంక్షన్ హాల్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ వేడుకల్లో ప్రముఖ డీజేలు VDJ నోజ్, DJ డీప్స్ సందడి చేయనున్నారు. లైవ్ పంజాబీ డోల్, ఫుడ్ స్టాల్స్, ఫొటోబూత్, ఇండోర్–అవుట్‌డోర్ అలంకరణలు, బతుకమ్మ డెకార్స్, ఎల్‌ఈడీ అండ్ లేజర్ షో, బాలీవుడ్–టాలీవుడ్ డీజే సంగీతం, మెగా దాండియా ధమాకా వంటి ప్రత్యేక ఆకర్షణలు ఏర్పాటు చేయనున్నారు. టికెట్...

ఉద్యమ నిరుద్యోగ కళాకారుల కన్నీటి దీక్ష సాంస్కృతిక సారథిలో ఉద్యమ కళాకారులకు ఉద్యోగాలు కల్పించాలి: కళాకారుల సంఘం డిమాండ్

తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నిరుద్యోగ కళాకారులకు సాంస్కృతిక సారథిలో ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నిరుద్యోగ కళాకారుల సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు పందిరి సైదన్న ఆధ్వర్యంలో గురువారం స్థానిక కలెక్టరేట్ ఎదుట శాంతియుత నిరాహార దీక్ష చేపట్టారు. ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కళాకారులకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి, ఇప్పటివరకు అమలు చేయకపోవడంపై వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కళాకారులు మాట్లాడుతూ.. ప్రజా పాలన ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రకటించిన మేనిఫెస్టోలో 96వ అంశంగా...

సమగ్ర కులగణనకు ప్రత్యేక కోడింగ్‌ తప్పనిసరి రాష్ట్రాల వారీగా కులాల జాబితాలు రూపొందించాలి: బీసీ మేధావుల వేదిక జిల్లా సమన్వయకర్త నేలపట్ల చంద్రశేఖర్

దేశంలో సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, వెనుకబడిన వర్గాలకు సంక్షేమ ఫలాల సముచిత పంపిణీ జరగాలంటే సమగ్రంగా, పారదర్శకంగా కులగణన నిర్వహించాలని బీసీ మేధావుల వేదిక (బీసీఐఎఫ్‌) నల్గొండ జిల్లా ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు గురువారం జిల్లా కలెక్టర్‌ ద్వారా భారత రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పించారు. ప్రస్తుత జనగణన ప్రక్రియలో అవసరమైన మార్పులు చేసి, వెనుకబడిన తరగతులకు జనాభా ప్రాతిపదికన సరైన గుర్తింపు, ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. జాతీయ కులగణన పోరాట కమిటీ, బీసీఐఎఫ్‌ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు, విశ్రాంత ఐఏఎస్‌...

వరంగల్- ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం ఓటరు గా నమోదు చేసుకోండి- జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్.

వరంగల్- ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం పరిధిలో ఉంటూ ఓటరు నమోదుకు అర్హత కలిగి ఉండి, ఇంకా ఓటరుగా నమోదు చేసుకొనని వారు వెంటనే ఓటరుగా నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నవంబర్ 1 ,2026 అర్హత తేదీగా వరంగల్- ఖమ్మం -నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గానికి తాజా ఓటర్ల జాబితా రూపొందించడం జరుగుతున్నదని, అర్హులైన వారందరూ పట్టభద్రుల నియోజకవర్గానికి ఓటరుగా నమోదు చేసుకోవచ్చని ఒక ప్రకటనలో కోరారు . వరంగల్, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి,...

పట్టభద్రుల ఓటరు నమోదుపై కంచర్ల భూపాల్ రెడ్డి సమీక్ష ఎన్రోలర్లు, నాయకులు ఇంటింటికీ తిరిగి ఓటరు నమోదు చేయించాలి: ఏనుగుల రాకేష్ రెడ్డి

నల్లగొండ: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా నల్లగొండ నగరంలోని 1 నుంచి 25 వార్డులకు చెందిన ముఖ్య నాయకులు, కార్పొరేటర్లు, పోటీ చేసిన కార్పొరేటర్లు, ఓటరు నమోదు ఎన్రోలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి పాల్గొని ఇప్పటివరకు జరిగిన ఓటరు నమోదు ప్రక్రియను సమీక్షించారు. ఈ సందర్భంగా కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ, ప్రతి డివిజన్‌లోని నాయకులు, కార్పొరేటర్లు, ఎన్రోలర్లు ఇంటింటికీ తిరిగి...

ఘనంగా దుర్గామాత అభిషేకం ముఖ్య అతిథిగా పాల్గొన్న డా. నాగం వర్షిత్ రెడ్డి

నల్లగొండలో 37వ డివిజన్ కార్పొరేటర్ అఖిల్ రావు ఆధ్వర్యంలో హిందూ బంధువులు దుర్గామాత అభిషేక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు డా. నాగం వర్షిత్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హిందూ బంధువులందరూ కులాలకు అతీతంగా ఐకమత్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో 39వ డివిజన్ కార్పొరేటర్ దాసరి సాయి యాదవ్, మాజీ కార్పొరేటర్ బొజ్జ...

ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి.. పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు బీజేపీ పోరాటం — డా. నాగం వర్షిత్ రెడ్డి

నల్లగొండ కలెక్టరేట్ ఎదుట నేషనల్ హెల్త్ మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) కాంట్రాక్ట్ ఉద్యోగులు చేపట్టిన ధర్నాలో బీజేపీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు డా. నాగం వర్షిత్ రెడ్డి పాల్గొని, వారి పోరాటానికి బీజేపీ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా సుమారు 17 వేల మంది ఎన్‌హెచ్‌ఎం కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉద్యోగాల క్రమబద్ధీకరణకు నోచుకోకుండా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కరోనా సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలకు సేవలందించిన ఉద్యోగులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం అన్యాయమని విమర్శించారు. ఏజెన్సీల ద్వారా...

వైద్యశాఖ నియామకాలపై ఆరోపణల కలకలం! నల్గొండ డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో పోస్టుల భర్తీపై ఫిర్యాదు

నోటిఫికేషన్‌ లేకుండానే నియామకాలా? • ఒక్కో పోస్టుకు రూ.2–4 లక్షలు వసూలు చేశారంటూ ఆరోపణలు • రాష్ట్ర అధికారులకు నిరుద్యోగుల ఫిర్యాదు నల్గొండ: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్‌ఓ) కార్యాలయంలో పోస్టుల భర్తీ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. జాతీయ ఆరోగ్య మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం), జాతీయ క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమం (ఎన్‌టీఈపీ) పరిధిలో నాలుగు ల్యాబ్‌ టెక్నీషియన్‌, రెండు ఎస్‌టీఎల్ఎస్‌ పోస్టుల నియామకాలపై నిరుద్యోగ అభ్యర్థులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం....