బీఆర్ఎస్ ప్రభుత్వంలో అక్రమాలు, స్కాములు చేసిన చరిత్ర మీది - సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సూర దేవరాజు

సిరిసిల్ల టౌన్, ప్రజాతంత్ర, అక్టోబర్ 17:ప్రజల సొమ్మును దోచుకొని అవినీతి అక్రమాలకు పాల్పడిన డబ్బుతో ఫామ్‌హౌస్‌లు, హోటళ్లు, భూములు కొనుగోలు చేయడంతో పాటు భార్యలు, పిల్లల పేర్ల మీద ఆస్తులు కూడబెట్టుకోవడంపై దృష్టి పెట్టారని ఆరోపించారు. ప్రజా సమస్యలు, రైతుల సంక్షేమాన్ని పట్టించుకోలేదని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సూర దేవరాజు విమర్శించారు. ప్రెస్ క్లబ్‌లో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. 2014, 2015 సంవత్సరాల్లో ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు, నీటి లభ్యత తగ్గే పరిస్థితులు ఉన్నప్పటికీ అప్పటి ప్రభుత్వం రైతులకు సరైన అవగాహన కల్పించలేదని అన్నారు. దీంతో పంటలు సాగుచేసిన రైతులు నష్టపోయి ఆర్థికంగా కుంగిపోయారని, అప్పులు...