కుక్కడంలో ఎక్స్‌ప్రెస్‌ బస్సులు ఆపాలి! ప్రభుత్వ ఉద్యోగులు, మహిళా ఉపాధ్యాయుల ఇబ్బందులు తొలగించాలి ప్రైవేటు వాహనాలపై ఆధారపడుతున్న ఉద్యోగులు.. ప్రమాదాల బారిన పడుతున్న ప్రయాణికులు

కుక్కడం: మాడ్లపల్లి మండలం కుక్కడం గ్రామంలో ఉదయం వేళ ఎక్స్‌ప్రెస్‌ బస్సులు ఆపాలని గ్రామస్థులు, ఉపాధ్యాయులు ఆర్టీసీ అధికారులను కోరుతున్నారు. గ్రామంలో ప్రభుత్వ విద్యాసంస్థలు, రెసిడెన్షియల్‌ పాఠశాలలు, కళాశాలలతో పాటు పలు ప్రభుత్వ కార్యాలయాలు, రైల్వే స్టేషన్‌ ఉన్నప్పటికీ ఉదయం వేళ ఎక్స్‌ప్రెస్‌ బస్సులు నిలపకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు పేర్కొంటున్నారు. ప్రత్యేకించి ప్రభుత్వ విద్యాసంస్థల్లో పనిచేసే మహిళా ఉపాధ్యాయులు, ఉద్యోగులు సమయానికి విధులకు చేరుకోవడానికి నానా అవస్థలు పడుతున్నారు. ఉద్యోగులకు ఎఫ్‌ఆర్‌ఎస్‌ (ఫేషియల్‌ రికగ్నిషన్‌ సిస్టమ్‌) హాజరు తప్పనిసరి కావడంతో సమయానికి పాఠశాలలు, కార్యాలయాలకు చేరుకోవాల్సి వస్తోంది. అయితే గ్రామంలో ఎక్స్‌ప్రెస్‌ బస్సులు ఆగకపోవడంతో ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోందని వారు...