అరకొర వసతులతో తూ తూ మంత్రంగా. కార్పొరేషన్ అయి మొదటి .బతుకమ్మ వేడుకల్లో అరకొర ఏర్పాట్లు..
చీకటి వెలుగు నల్లగొండ. విద్యుత్ లైట్లు,తాగునీరు లేదు.. సౌండ్ బాక్సులు లేవు.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ నిర్వహణలో నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల తీరు ప్రశ్నార్థకంగా మారిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా వేడుకల ఏర్పాట్ల బాధ్యతల్లో కీలక పాత్ర పోషించాల్సిన మున్సిపల్ అధికారులు పర్యవేక్షణపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నాగార్జున ప్రభుత్వ కళాశాల మైదానంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించేందుకు అక్కడికి వచ్చే మహిళలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో ఎందుకు నిర్లక్ష్యం జరిగిందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తాగునీటి సౌకర్యం లేకపోవడం, బతుకమ్మ పాటల కోసం సౌండ్, బాక్సులు, విద్యుత్ లైట్లు కూడా అందుబాటులో లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. నల్లగొండ మున్సిపాలిటీ కార్పొరేషన్‌గా ఏర్పడిన...