పెన్షనర్ల బకాయిలు ఒకేసారి చెల్లించాలి దసరా, దీపావళి తర్వాత ‘చలో హైదరాబాద్’కు పిలుపు టీఎస్‌జీఆర్ఈఏ రాష్ట్ర అధ్యక్షుడు పేరి వెంకట్‌రెడ్డి
చీకటి వెలుగు నల్లగొండ. ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎస్)లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంతోపాటు, పెన్షనర్లకు రావాల్సిన పీఆర్సీ ప్రయోజనాలు, ఇతర బకాయిలను సాధించేందుకు కృషి చేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (టీఎస్‌జీఆర్ఈఏ) రాష్ట్ర అధ్యక్షుడు పేరి వెంకట్‌రెడ్డి తెలిపారు. నల్లగొండలోని జిల్లా పెన్షనర్ల సామాజిక సేవా భవన్‌లో శుక్రవారం జిల్లా అధ్యక్షుడు జి.వెంకట్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వైద్య సేవల్లో ఇబ్బందులు తొలగించాలి: ఉద్యోగుల వేతనాల నుంచి 1.5 శాతం మినహాయించి అమలు చేస్తున్న ఈహెచ్‌ఎస్ ద్వారా కుటుంబ సభ్యులకు వివిధ వ్యాధులకు చికిత్స పొందే అవకాశం ఉందని పేరి వెంకట్‌రెడ్డి తెలిపారు. అయితే, కొత్త ఆరోగ్య కార్డులను దింపుకోవడం,...