ఉద్యమ నిరుద్యోగ కళాకారుల కన్నీటి దీక్ష సాంస్కృతిక సారథిలో ఉద్యమ కళాకారులకు ఉద్యోగాలు కల్పించాలి: కళాకారుల సంఘం డిమాండ్

తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నిరుద్యోగ కళాకారులకు సాంస్కృతిక సారథిలో ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నిరుద్యోగ కళాకారుల సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు పందిరి సైదన్న ఆధ్వర్యంలో గురువారం స్థానిక కలెక్టరేట్ ఎదుట శాంతియుత నిరాహార దీక్ష చేపట్టారు. ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కళాకారులకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి, ఇప్పటివరకు అమలు చేయకపోవడంపై వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కళాకారులు మాట్లాడుతూ.. ప్రజా పాలన ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రకటించిన మేనిఫెస్టోలో 96వ అంశంగా ఉద్యమ నిరుద్యోగ కళాకారులకు ఉద్యోగాలు కల్పిస్తామని పేర్కొందని గుర్తు చేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చాలాకాలం గడుస్తున్నా హామీ అమలులో...