వరంగల్- ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం ఓటరు గా నమోదు చేసుకోండి- జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్.

వరంగల్- ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం పరిధిలో ఉంటూ ఓటరు నమోదుకు అర్హత కలిగి ఉండి, ఇంకా ఓటరుగా నమోదు చేసుకొనని వారు వెంటనే ఓటరుగా నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నవంబర్ 1 ,2026 అర్హత తేదీగా వరంగల్- ఖమ్మం -నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గానికి తాజా ఓటర్ల జాబితా రూపొందించడం జరుగుతున్నదని, అర్హులైన వారందరూ పట్టభద్రుల నియోజకవర్గానికి ఓటరుగా నమోదు చేసుకోవచ్చని ఒక ప్రకటనలో కోరారు . వరంగల్, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, జనగాం ,ఖమ్మం ,భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలు వరంగల్- ఖమ్మం -నల్గొండ పట్టభద్రుల...