పట్టభద్రుల ఓటరు నమోదుపై కంచర్ల భూపాల్ రెడ్డి సమీక్ష ఎన్రోలర్లు, నాయకులు ఇంటింటికీ తిరిగి ఓటరు నమోదు చేయించాలి: ఏనుగుల రాకేష్ రెడ్డి

నల్లగొండ: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా నల్లగొండ నగరంలోని 1 నుంచి 25 వార్డులకు చెందిన ముఖ్య నాయకులు, కార్పొరేటర్లు, పోటీ చేసిన కార్పొరేటర్లు, ఓటరు నమోదు ఎన్రోలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి పాల్గొని ఇప్పటివరకు జరిగిన ఓటరు నమోదు ప్రక్రియను సమీక్షించారు. ఈ సందర్భంగా కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ, ప్రతి డివిజన్‌లోని నాయకులు, కార్పొరేటర్లు, ఎన్రోలర్లు ఇంటింటికీ తిరిగి ఉద్యోగులు, పట్టభద్రులను గుర్తించి ఓటర్లుగా నమోదు చేయించాలని సూచించారు. ఇప్పటికే నమోదు చేసుకున్న వారి వివరాలను కూడా సేకరించి, అర్హులైన...