వైద్యశాఖ నియామకాలపై ఆరోపణల కలకలం! నల్గొండ డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో పోస్టుల భర్తీపై ఫిర్యాదు
నోటిఫికేషన్ లేకుండానే నియామకాలా? • ఒక్కో పోస్టుకు రూ.2–4 లక్షలు వసూలు చేశారంటూ ఆరోపణలు • రాష్ట్ర అధికారులకు నిరుద్యోగుల ఫిర్యాదు నల్గొండ: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్‌ఓ) కార్యాలయంలో పోస్టుల భర్తీ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం), జాతీయ క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమం (ఎన్‌టీఈపీ) పరిధిలో నాలుగు ల్యాబ్ టెక్నీషియన్, రెండు ఎస్‌టీఎల్ఎస్ పోస్టుల నియామకాలపై నిరుద్యోగ అభ్యర్థులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఆరు పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారా? ఎంపిక ప్రక్రియ ఏ విధంగా నిర్వహించారు? అభ్యర్థుల ఎంపికకు అనుసరించిన...