మహిళలకు న్యాయం చేయాలి — నల్గొండలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం

మణిపూర్‌కు చెందిన కాంగ్రెస్ ఎంపీ భీమోల్ అకోయిజామ్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ నాయకత్వం స్పష్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నల్గొండలో బీజేపీ, మహిళా మోర్చా ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ, 11 మంది విద్యార్థినుల ఫిర్యాదుల నేపథ్యంలో అంతర్గత కమిటీ విచారణ అనంతరం జేఎన్‌యూ యాజమాన్యం భీమోల్ అకోయిజామ్‌ను ఉద్యోగం నుంచి తొలగించడం తీవ్రమైన విషయమని పేర్కొన్నారు. ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదైన నేపథ్యంలో నిష్పక్షపాత విచారణ జరిపి, బాధిత విద్యార్థినులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మహిళల హక్కుల గురించి మాట్లాడే...