గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ కసరత్తు
అసెంబ్లీల వారీగా పార్టీ నేతలకు బాధ్యతలు.. ఇన్చార్జ్లను నియమించిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సన్నద్ధతపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీ నాయకులకు బాధ్యతలు అప్పగిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇన్చార్జ్లను నియమించారు. ఎన్నికల్లో పార్టీ విజయావకాశాలను మెరుగుపరచడంతో పాటు, క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమన్వయం చేసేందుకు ఈ నియామకాలు చేపట్టారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల ఓటర్ల మద్దతు కూడగట్టడమే లక్ష్యంగా కాంగ్రెస్ నాయకత్వం కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా బాధ్యతలు అప్పగించడం ద్వారా ఎన్నికల ప్రచారాన్ని సమన్వయంతో ముందుకు...