తెలంగాణలో ఎఫ్ఎంజీ ఇంటర్న్ వైద్యుల రాష్ట్రవ్యాప్త ఆందోళన
స్టైపెండ్‌లో వ్యత్యాసంపై నాలుగు రోజులుగా నిరసన.. నెలకు రూ.29,792 చెల్లించాలని డిమాండ్ తెలంగాణ: రాష్ట్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రుల్లో విధులు నిర్వహిస్తున్న విదేశీ వైద్య విద్యా పట్టభద్రులైన ఎఫ్ఎంజీ (FMG) ఇంటర్న్ వైద్యులు స్టైపెండ్‌లో వ్యత్యాసాన్ని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా శాంతియుత ఆందోళనను ఉధృతం చేశారు. తమకు భారతీయ వైద్య విద్యా పట్టభద్రులైన ఐఎంజీ (IMG) ఇంటర్న్లతో సమానంగా నెలకు రూ.29,792 స్టైపెండ్ చెల్లించాలని, 2026 జనవరి నుంచి పెండింగ్‌లో ఉన్న బకాయిలను విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. విధులు ఒకటే.. స్టైపెండ్‌లో వ్యత్యాసం ఎఫ్ఎంజీ ఇంటర్న్ వైద్యులు ఓపీడీ సేవలు, వార్డుల నిర్వహణ, అత్యవసర వైద్య సేవలు, క్యాజువాలిటీ విధులు వంటి బాధ్యతలను నిర్వహిస్తున్నప్పటికీ,...