నల్గొండ గ్రామీణ రహదారులకు మహర్దశ.. రూ.74 కోట్లతో డబుల్‌ రోడ్లు

తేలకంటిగూడెం–ముషంపల్లి, ఎస్‌.లింగోటం–ముషంపల్లి రోడ్లకు శంకుస్థాపన చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కలెక్టర్‌ బడుగు చంద్రశేఖర్‌ నల్గొండ నియోజకవర్గంలో రహదారి సౌకర్యాల మెరుగుదలకు రూ.74 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న రెండు డబుల్‌ రోడ్ల నిర్మాణ పనులకు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, నల్గొండ జిల్లా కలెక్టర్‌ బడుగు చంద్రశేఖర్‌తో కలిసి సోమవారం శంకుస్థాపన చేశారు.కనగల్‌ మండలం తేలకంటిగూడెం, ఎస్‌.లింగోటం గ్రామాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. తేలకంటిగూడెం నుంచి తొరగల్లు, జంగమాయిగూడెం మీదుగా ముషంపల్లి వరకు రూ.41 కోట్లతో, ఎస్‌.లింగోటం రోడ్డు నుంచి చెట్లచెన్నారం, చిన్నమాదారం, తంగెళ్లవారిగూడెం మీదుగా ముషంపల్లి వరకు రూ.33...