నేతాజీ డిగ్రీ కళాశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
సిరిసిల్ల: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని సిరిసిల్లలోని నేతాజీ డిగ్రీ కళాశాలలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో విద్యార్థినులు, అధ్యాపకులు ఉత్సాహంగా పాల్గొని బతుకమ్మ ఆటపాటలతో సందడి చేశారు. రంగురంగుల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలతో కళాశాల ప్రాంగణం పండుగ శోభను సంతరించుకుంది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ, తమ కళాశాలలో బతుకమ్మ వేడుకలతో పాటు అన్ని పండుగలు, ప్రత్యేక కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. పండుగల ద్వారా విద్యార్థుల్లో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన పెంపొందించడంతో పాటు ఐక్యతా భావాన్ని ప్రోత్సహిస్తున్నామని...