విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని నిరంతరం కృషి చేయాలి
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.. రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలి జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే సిరిసిల్ల: విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించేందుకు నిరంతరం కృషి చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే సూచించారు. సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ కళాశాలలో నిర్వహించిన 100 రోజుల త్రివర్ణ పతాక కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రతి విద్యా సంవత్సరంలో 100 రోజుల పాటు జాతీయ జెండాను ఎగురవేసే కార్యక్రమం అభినందనీయమని ఎస్పీ పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో దేశభక్తి, జాతీయ భావం, దేశం పట్ల గౌరవం, బాధ్యతను పెంపొందిస్తాయని తెలిపారు....