ఆర్టీఐ అమలులో నల్గొండకు రాష్ట్రస్థాయి గుర్తింపు

ఉత్తమ పనితీరుకు కలెక్టర్ బి. చంద్రశేఖర్‌కు రాష్ట్రస్థాయి అవార్డుసమాచార హక్కు చట్టం సెక్షన్‌ 4(1)(బి) కింద స్వచ్ఛంద సమాచార వెల్లడిలో విశేష పనితీరు నల్గొండ, సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) అమలులో నల్గొండ జిల్లా మరోసారి రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందింది. ఆర్టీఐ చట్టంలోని సెక్షన్‌ 4(1)(బి) కింద సమాచారాన్ని స్వచ్ఛందంగా వెల్లడించడంలో ఉత్తమ పనితీరు కనబరిచినందుకు నల్గొండ జిల్లా కలెక్టర్‌ బి. చంద్రశేఖర్‌ రాష్ట్రస్థాయి అవార్డుకు ఎంపికయ్యారు...ఈ మేరకు గురువారం రాష్ట్ర సమాచార హక్కు చట్టం చీఫ్‌ కమిషనర్‌ కార్యాలయం నుంచి ఉత్తర్వులు అందాయి. అక్టోబర్‌ 9న సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి కార్యక్రమంలో కలెక్టర్‌ బి. చంద్రశేఖర్‌ అవార్డును స్వీకరించనున్నారు...ఆర్టీఐ...