ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ కొలువులే లక్ష్యంగా ముందడుగు ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకుని లక్ష్యాన్ని చేరాలి.. క్రమశిక్షణ, పట్టుదలతో సాధన చేయాలి: కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌, ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌

REPORTER KUKUTLA VARUN ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతీ యువకులకు అందిస్తున్న ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకుని ఎస్‌ఐ, పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగాలను సాధించాలని జిల్లా కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌, జిల్లా ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ సూచించారు. జిల్లా పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో జిల్లా పోలీస్‌ శిక్షణ కేంద్రంలో నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ తరగతులను బుధవారం వారు పరిశీలించారు. ఈ సందర్భంగా శిక్షణ పొందుతున్న అభ్యర్థులతో మాట్లాడి వారి సన్నద్ధత, శిక్షణ విధానం, బోధనకు సంబంధించిన అంశాలను అడిగి తెలుసుకున్నారు.పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే ముందుగా స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని దాని సాధన కోసం నిరంతరం శ్రమించాలని కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌ సూచించారు. పోలీస్‌ ఉద్యోగాల కోసం...