నీళ్ల కోసం రైతన్న కన్నీళ్లు! సాగునీరు లేక ఎండుతున్న పంటలు.. కళ్లముందే కరిగిపోతున్న అన్నదాత ఆశలు..

వ్యాసకర్త : కుకుట్ల వరుణ్ జర్నలిస్ట్.. నీళ్లు లేక.. ఎండుతున్న పంటలు! నీళ్ల కోసం రైతన్న ఎదురుచూపులు.. పెట్టుబడులు పెట్టి పంటను కాపాడుకునేందుకు నానా తంటాలు.. తెలంగాణ పల్లెల్లో రైతన్న పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. పంట పొలాల్లో పచ్చదనం తగ్గి.. నీటి కోసం ఎదురుచూసే దుస్థితి నెలకొంది. సాగునీరు సకాలంలో అందకపోవడంతో పంటలు వాడిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెలల తరబడి కష్టపడి సాగు చేసిన పంట చివరి దశలో నీటి కొరత బారిన పడటంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది. పంటను కాపాడుకునేందుకు రైతులు బోర్లు, బావులు, ఇతర నీటి వనరులపై ఆధారపడుతున్నా.. అవసరమైన స్థాయిలో నీరు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు....