మూడేళ్లలో రూ.4 లక్షల కోట్లు దాటిన తెలంగాణ అప్పు! డిసెంబరు 2023 నుంచి అక్టోబరు 2026 వరకు రూ.4,01,234 కోట్ల రుణం
REPORTER KUKUTLA VARUN కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అప్పులు భారీగా పెరిగాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. డిసెంబరు 2023 నుంచి అక్టోబరు 2026 వరకు ప్రభుత్వం వివిధ మార్గాల్లో సుమారు రూ.4,01,234 కోట్ల మేర అప్పు చేసినట్లు పేర్కొంటున్నాయి. దీంతో మూడేళ్లలోనే అప్పుల భారం రూ.4 లక్షల కోట్ల మార్కును దాటిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి..2023 డిసెంబరులో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర పగ్గాలు చేపట్టినప్పటి నుంచి అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, ప్రభుత్వ కార్యక్రమాలు, ఇతర ఆర్థిక అవసరాల కోసం రుణ సమీకరణ కొనసాగుతోందని ప్రతిపక్షాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే రాష్ట్రానికి ఉన్న పాత అప్పులకు తోడు కొత్తగా తీసుకుంటున్న రుణాలు కూడా చేరడంతో మొత్తం...