పీహెచ్సీల్లో పరిశుభ్రతకు పెద్దపీట వేయాలి చెత్త పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు పారిశుధ్య చర్యలు చేపట్టాలి: కలెక్టర్ బి.చంద్రశేఖర్
REPORTER KUKUTLA VARUN వేములపల్లి: ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశుభ్రంగా ఉంచాలని, ఆసుపత్రి పరిసరాల్లో చెత్త పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు పారిశుధ్య చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం వేములపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని ఓపీ వివరాలు, రోగుల రిజిస్ట్రేషన్, డెంగ్యూ, పాము కాటు కేసులు, సిబ్బంది హాజరు, మందుల నిల్వలు, డ్రగ్స్ రిజిస్టర్ తదితర రికార్డులను పరిశీలించారు. ఆసుపత్రిలో ఎదురవుతున్న సమస్యలు, ప్రస్తుతం నమోదవుతున్న కేసుల వివరాలను వైద్యాధికారిని అడిగి తెలుసుకున్నారు.ప్రస్తుతం జలుబు, దగ్గు తదితర సీజనల్ వ్యాధులకు సంబంధించిన కేసులు అధికంగా వస్తున్నట్లు వైద్యాధికారి కలెక్టర్కు...