సేవా జ్యోతి కలశ యాత్రకు కర్నాటి శివ గౌడ్ ఎంపిక

నల్గొండ జిల్లా నుంచి అవకాశం.. అక్టోబరు 7 నుంచి దేశవ్యాప్తంగా యాత్ర జిల్లా కొండాపురం గ్రామానికి చెందిన కర్నాటి శివ గౌడ్ దేశవ్యాప్తంగా నిర్వహించనున్న **‘సేవా జ్యోతి కలశ యాత్ర’**కు ఎంపికయ్యారు. అక్టోబరు 7 నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవా ప్రస్థానంలో 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చేపడుతున్న **‘సేవా సంకల్ప అభియాన్’**లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు చేపడుతున్న ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు సేవాభావాన్ని మరింత పెంపొందించడమే యాత్ర ప్రధాన ఉద్దేశ్యమని పేర్కొన్నారు. ‘వికసిత్ భారత్’ లక్ష్య సాధనలో ప్రజల భాగస్వామ్యం,...