తెలంగాణ హైకోర్టు తాత్కాలిక సీజేగా జస్టిస్ సామ కోషీ
రాష్ట్రపతి నియామకం.. అపరేష్‌కుమార్ సింగ్ బాధ్యతల నుంచి తప్పుకున్న తేదీ నుంచి అమలుREPORTER KUKUTLA VARUN హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (యాక్టింగ్ చీఫ్ జస్టిస్)గా జస్టిస్ సామ కోషీ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ఆయనను తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ అపరేష్‌కుమార్ సింగ్ ఆ బాధ్యతల నుంచి తప్పుకున్న తేదీ నుంచి జస్టిస్ సామ కోషీ నియామకం అమల్లోకి రానుంది. దీంతో హైకోర్టు తదుపరి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా సామ కోషీ బాధ్యతలు చేపట్టనున్నారు. జస్టిస్ సామ కోషీ న్యాయవ్యవస్థలో విశేష అనుభవం...