పాత కాగితాలతో కొత్త నోట్‌బుక్స్‌.. పర్యావరణ పరిరక్షణకు నాగార్జున కళాశాల వినూత్న అడుగు రీసైక్లింగ్‌తో నూతన నోట్‌బుక్‌ల తయారీ.. విద్యార్థుల్లో పునర్వినియోగంపై అవగాహనకు ప్రాధాన్యం

REPORTER KUKUTLA VARUN పర్యావరణ పరిరక్షణతో పాటు కాగితం వృథాను అరికట్టే లక్ష్యంతో నాగార్జున డిగ్రీ అండ్‌ పీజీ కళాశాల ఫిజిక్స్‌ విభాగం, ‘యూత్‌ ఫర్‌ సేవా’ స్వచ్ఛంద సంస్థ సంయుక్తంగా వినూత్న కార్యక్రమాన్ని చేపట్టాయి. కళాశాలలో వినియోగం లేకుండా ఉన్న పాత రికార్డులు, నోట్‌బుక్స్‌, కాగితాలను సేకరించి వాటిని రీసైక్లింగ్‌ చేయించారు. ఈ ప్రక్రియ ద్వారా లభించిన పునర్వినియోగ కాగితంతో కొత్త నోట్‌బుక్స్‌ను తయారు చేయించారు. రీసైక్లింగ్‌ ద్వారా తయారైన తొలి నోట్‌బుక్‌ను కళాశాల ప్రిన్సిపాల్‌ శ్రీ ఉపేందర్‌ అధికారికంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ ఉపేందర్‌ మాట్లాడుతూ.. ఇప్పటికే వినియోగించిన నోట్‌బుక్స్‌, కాగితాలను పారవేయకుండా వాటిని రీసైక్లింగ్‌ చేసి తిరిగి ఉపయోగించుకునేలా చేయడం...