నకిలీ ఓటర్ దరఖాస్తులపై ఎన్నికల సంఘం సీరియస్ SIR–2026లో తప్పుడు వివరాలతో Form–7 దరఖాస్తులపై కఠిన చర్యలు.. విచారణకు ఈసీ ఆదేశాలు

తెలంగాణలో SIR–2026 ప్రక్రియ సందర్భంగా తప్పుడు వివరాలతో దాఖలైనట్లు గుర్తించిన ఓటర్ దరఖాస్తులపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్‌గా స్పందించింది. పెద్ద సంఖ్యలో Form–7 నకిలీ దరఖాస్తులు దాఖలైనట్లు గుర్తించిన ఎన్నికల సంఘం.. వాటిపై సమగ్ర విచారణ చేపట్టి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది...SIR–2026 ప్రక్రియలో భాగంగా ఓటర్ల జాబితాకు సంబంధించి అందిన Form–7 దరఖాస్తులను పరిశీలిస్తున్న క్రమంలో పలు దరఖాస్తుల్లో తప్పుడు వివరాలు, అనుమానాస్పద సమాచారాన్ని గుర్తించినట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇటువంటి దరఖాస్తులపై నిబంధనల ప్రకారం విచారణ జరిపి, తప్పు చేసినట్లు నిర్ధారణ అయితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.తప్పుడు సమాచారంతో ఓటర్ దరఖాస్తులు సమర్పించడం ఎన్నికల...