మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు
మున్సిపల్ చైర్పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ చీకటి వెలుగు, నల్లగొండ: గాంధీ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి మొగుదాల పావని రమేష్ గౌడ్ అధ్యక్షతన మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ మాట్లాడుతూ ప్రజలందరికీ గాంధీ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి శుభాకాంక్షలు తెలిపారు. గాంధీజీ చూపిన అహింస, శాంతి మార్గాలు, లాల్ బహదూర్ శాస్త్రి పాటించిన నిజాయితీ, ఆయన ఇచ్చిన “జై జవాన్–జై కిసాన్” నినాదం దేశానికి...