ఉర్సు ఉత్సవాల సందర్భంగా ఘనంగా అన్నదానం
చీకటి వెలుగు, నల్లగొండ: లతీఫుల్లా షా ఖాద్రి ఉర్సు ఉత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం గుట్ట మెట్ల వద్ద భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముతవల్లి సమీయుల్లా ఖాద్రి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు 2,000 మంది భక్తులకు అన్నదానం నిర్వహించినట్లు తెలిపారు. ఉర్సు ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. భక్తులకు సేవ చేయడం సంతోషంగా ఉందని నిర్వాహకులు తెలిపారు. అనంతరం రాత్రి నిర్వహించిన అజ్మతే ఔలియా కార్యక్రమంలో హైదరాబాద్కు చెందిన కళాకారులు ఉర్దూ భాషలో లతీఫుల్లా షా ఖాద్రి గొప్పతనం, మహిమ, ఔన్నత్యాన్ని భక్తులకు వివరించారు. ఈ కార్యక్రమానికి భక్తులు...