సంక్షేమ హాస్టళ్లకు నిధులు కేటాయించాలి

కెవిపిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడుగు నాగార్జున చీకటి వెలుగు, నల్లగొండ, అక్టోబర్ 2: కుల వివక్షకు వ్యతిరేకంగా, దళితులు, గిరిజనులు, పేదల హక్కుల సాధన కోసం రాబోయే రోజుల్లో జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడుగు నాగార్జున తెలిపారు. సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంతోపాటు, వాటికి అవసరమైన నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కెవిపిఎస్ 29వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం నల్లగొండ జిల్లా కేంద్రంలో సంఘం జెండాను ఆవిష్కరించిన అనంతరం నాగార్జున మాట్లాడారు. 62 రకాల కుల వివక్షలను వెలుగులోకి తెచ్చిన ఉద్యమం 1998 అక్టోబర్...