తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవ యాత్రకు సంపూర్ణ మద్దతు: మాజీ ఎమ్మెల్యే కంచర్ల

తెలంగాణ బ్రాహ్మణ ఐక్య వేదిక, తెలంగాణ బ్రాహ్మణ ఉద్యమకారుల ఐక్య వేదిక సంయుక్తంగా చేపట్టనున్న “తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవ యాత్ర”కు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి తెలిపారు. నల్లగొండలోని తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆత్మగౌరవ యాత్రకు సంబంధించిన పోస్టర్‌ను కంచర్ల భూపాల్‌రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవం కోసం యాత్ర చేపట్టడం మంచి కార్యక్రమమని అన్నారు. మహిళా శాసనసభ్యులకు అవమానం జరిగిన అసెంబ్లీ ప్రాంగణం నుంచే ఈ యాత్రను ప్రారంభిస్తే మరింత సముచితంగా ఉంటుందని ఆయన సూచించారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో బ్రాహ్మణులకు ప్రాధాన్యత, గౌరవం లభించిందని...