సుదీర్ఘ జీవితాలకు వ్యవస్థల్లో మార్పులు అవసరం
వృద్ధుల హక్కుల పరిరక్షణకు చట్టాలు.. నిర్లక్ష్యం చేస్తే న్యాయ సహాయం పొందాలిఆస్తులు ఇచ్చినా పట్టించుకోకపోతే తిరిగి పొందే అవకాశం నల్లగొండ, అక్టోబర్ 1: పెరుగుతున్న ఆయుర్దాయానికి అనుగుణంగా కుటుంబ, సామాజిక, ఆరోగ్య, సంక్షేమ వ్యవస్థల్లో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని జిల్లా సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి. హిమబిందు అన్నారు. వృద్ధుల హక్కుల పరిరక్షణకు చట్టాలు ఉన్నాయని, వాటిపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా నల్లగొండ జిల్లా కలెక్టరేట్ సముదాయంలోని ఉదయాదిత్య భవన్లో మహిళా, శిశు, వికలాంగుల, వయోవృద్ధుల శాఖ, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా...