సొంత తమ్ముడినే అతి కిరాతకంగా హత్య చేయించిన అన్న

తెలంగాణ : మంచిర్యాల జిల్లాలో ఆస్తి తగాదాలు దారుణానికి దారితీశాయి. వేమనపల్లి మండలం నీల్వాయి గ్రామానికి చెందిన కుడుకల శ్రీనివాస్‌ను, అతని అన్న రాజేష్‌ ఆస్తి కోసం కిరాయి హంతకులతో హత్య చేయించాడు. ఈ నెల 20న శ్రీనివాస్‌ స్నేహితుడిని కలుస్తానని వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్, విచారణలో భాగంగా గోదరి సమ్మయ్యను అదుపులోకి తీసుకోగా అసలు విషయం బయటపడింది. భూమి, ఇళ్ల స్థలాల వివాదంతో శ్రీనివాస్‌ను అడ్డుతొలగించుకోవడానికి రాజేష్‌ రూ.2 లక్షలు సుపారీ ఇచ్చి, బామ్మర్ది సమ్మయ్య, కిష్టస్వామి ద్వారా హత్య చేయించినట్లు పోలీసులు తెలిపారు