కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను భావితరాలకు అందించాలి జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్
నల్గొండ: నీతి, నిజాయితీతో ముక్కుసూటిగా వ్యవహరిస్తూ న్యాయం, ధర్మం కోసం పోరాడిన గొప్ప ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి సందర్భంగా నల్గొండలోని హైదరాబాద్ రోడ్డులో పాల కేంద్రం వద్ద ఉన్న ఆయన విగ్రహానికి కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించారు. స్వాతంత్ర్య ఉద్యమంతో పాటు తెలంగాణ ఉద్యమంలోనూ బాపూజీ కీలక పాత్ర పోషించారని తెలిపారు. ప్రజా సమస్యలపై పోరాడిన ఆయన సేవలు, ఆశయాలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ చూపిన న్యాయం, ధర్మం మార్గంలో నడుస్తూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్...