నల్లగొండలో ప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవం

ప్రకృతి సమతుల్యతను కాపాడితేనే ఆరోగ్యకరమైన భవిష్యత్తు సివిల్ జడ్జి జి. హిమబిందు చీకటి వెలుగు, నల్లగొండ: ప్రకృతి సమతుల్యతను కాపాడితేనే ఆరోగ్యకరమైన భవిష్యత్తును నిర్మించగలమని సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి. హిమబిందు అన్నారు. ప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం నల్లగొండ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో చారుమతి చైల్డ్ కేర్ సెంటర్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని హిమబిందు పేర్కొన్నారు. స్వచ్ఛమైన గాలి, పరిశుభ్రమైన నీరు, ఆరోగ్యకరమైన నేల ఆరోగ్యకర సమాజానికి పునాదులని తెలిపారు. నల్లగొండ ఆర్డీవో వై. అశోక్‌రెడ్డి...