జూనియర్ అడ్వకేట్లకు వృత్తి నైపుణ్యంపై వర్క్‌షాప్
చీకటి వెలుగు, నల్లగొండ: న్యాయవాద వృత్తిలో అవసరమైన నైపుణ్యాలు, కోర్టు విధానాలు, వృత్తి నియమాలు, క్లయింట్ల పట్ల బాధ్యత, కోర్టు మర్యాద తదితర అంశాలపై జూనియర్ అడ్వకేట్లకు అవగాహన కల్పించేందుకు శనివారం నల్లగొండ బార్ అసోసియేషన్ హాల్లో ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ అడ్వకేట్ పులికంటి శ్రీనివాసరావు జూనియర్ అడ్వకేట్లకు పలు అంశాలపై మార్గదర్శనం చేశారు. కార్యక్రమానికి బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఆకవరం సతీష్, కార్యదర్శి బి. అశోక్ కుమార్ హాజరయ్యారు. వైఆర్పీ ఫౌండేషన్ అధినేత ఎలిశాల రవిప్రసాద్ ఆర్థిక సహకారం అందించారు. జిల్లేపల్లి రాఘవ, దండిగ స్వామిదాస్, మారబోయిన...