నల్లగొండలో ఘనంగా ముగిసిన గణేష్ నిమజ్జనోత్సవం

వర్షంలోనూ ఆగని భక్తుల సందడి.. అంగరంగ వైభవంగా గణేష్ శోభాయాత్ర! క్లాక్ టవర్ సెంటర్‌కు పోటెత్తిన భక్తులు.. గణనాథుడికి ఘనంగా వీడ్కోలు నల్లగొండ పట్టణంలో గణేష్ నిమజ్జనోత్సవం భక్తిశ్రద్ధల నడుమ అంగరంగ వైభవంగా, ప్రశాంత వాతావరణంలో ముగిసింది. నిన్న జరిగిన గణేష్ శోభాయాత్రకు పట్టణంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ముఖ్యంగా క్లాక్ టవర్ సెంటర్ భక్తులతో కిక్కిరిసిపోయింది. భారీ వర్షం కురుస్తున్నప్పటికీ భక్తులు వెనక్కి తగ్గకుండా శోభాయాత్రను వీక్షించేందుకు తరలివచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన గణేష్ విగ్రహాలు శోభాయాత్రలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. యువత, భక్తులు ఉత్సాహంగా పాల్గొని గణనాథుడికి ఘనంగా వీడ్కోలు పలికారు. పోలీసుల పటిష్ట...