మహిళా ఎమ్మెల్యేలపై దాడికి నిరసన.. బీఆర్‌ఎస్ ఆందోళనపై కేసు
తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన దాడికి నిరసనగా బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. సెప్టెంబరు 8న నల్గొండ పట్టణంలోని మర్రిగూడ బైపాస్ వద్ద నిర్వహించిన నిరసనపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారనే కారణంతో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, 30వ డివిజన్ ఇన్‌చార్జ్ జహంగీర్ బాబాపై కేసు నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్ నంబర్: 200/2026సెక్షన్లు: 126(2), 132, 189(2), 121(1), 190 బీఎన్‌ఎస్ శాంతియుతంగా చేపట్టిన ఆందోళనలపై పోలీసులు అక్రమ కేసులు బనాయించారని బీఆర్‌ఎస్ నేతలు ఆరోపించారు. కేసులు పెట్టి తమ పోరాటాలను అడ్డుకోలేరని బీఆర్‌ఎస్ నేతలు హెచ్చరించారు.