చెరువు లీజుతో అక్రమాలా..?

శాలిగౌరారం మత్స్యకారుల ప్రశ్న.. రమణ ముదిరాజ్‌పై కుట్రపూరిత ప్రచారాన్ని ఖండించిన సభ్యులు చీకటి వెలుగునల్లగొండ, సెప్టెంబర్ 12: శాలిగౌరారం పెద్ద చెరువు లీజు వ్యవహారంలో అక్రమాలు, నిబంధనల ఉల్లంఘన జరుగుతున్నాయని ప్రశ్నించిన తమ నాయకుడు ఎల్‌వీ రమణ ముదిరాజ్‌పై కొంతమంది కుట్రపూరితంగా ప్రచారం చేయడాన్ని శాలిగౌరారం మత్స్యకార సొసైటీ సభ్యులు తీవ్రంగా ఖండించారు.శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలు, మత్స్యశాఖ బైలా నిబంధనలకు విరుద్ధంగా చెరువును బయటి వ్యక్తులకు లీజుకు అప్పగించి దళారులు లబ్ధి పొందుతున్నారని వారు ఆరోపించారు. దీనిపై రమణ ముదిరాజ్ ప్రశ్నించడంతో ఆయనపై లేనిపోని ఫిర్యాదులు చేయడం సరికాదన్నారు.చెరువులను బయటి వ్యక్తులు,...