600 మందితో నల్లగొండలో ర్యాలీ.. డిమాండ్ల సాధనకు ఉద్యమబాటలో బ్యాంకు ఉద్యోగులు

చీకటి వెలుగునల్లగొండ, బ్యాంకు ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తోందంటూ బ్యాంకు ఉద్యోగులు నల్లగొండలో కదంతొక్కారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపు మేరకు గురువారం పట్టణంలో భారీ ర్యాలీ, నిరసన ప్రదర్శన నిర్వహించారు. జిల్లాలోని వివిధ బ్యాంకులకు చెందిన సుమారు 600 మంది ఉద్యోగులు తరలివచ్చి తమ డిమాండ్లపై గళమెత్తారు. క్లాక్‌టవర్ వద్ద ఉన్న ఎస్‌బీఐ నుంచి ప్రారంభమైన ర్యాలీ ప్రధాన వీధుల మీదుగా సాగింది. ఉద్యోగులు పెద్దఎత్తున నినాదాలు చేస్తూ ఎస్‌బీఐ ప్రాంతీయ వ్యాపార కార్యాలయానికి చేరుకుని అక్కడ నిరసన చేపట్టారు. ఐదు రోజుల బ్యాంకింగ్ విధానాన్ని తక్షణమే అమలు చేయాలని, పనితీరు ఆధారిత ప్రోత్సాహక...