సీపీఎస్‌ రద్దు.. ఓపీఎస్‌ అమలు చేయాలి:

తెలంగాణ ఉద్యోగుల, ఉపాధ్యాయుల సంయుక్త కార్యాచరణ సమితి చీకటి వెలుగు నల్లగొండ. సీపీఎస్‌ (కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ పథకం)ను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని (ఓపీఎస్‌) అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ ఉద్యోగుల, ఉపాధ్యాయుల సంయుక్త కార్యాచరణ సమితి (టీజీఈజేఏసీ) ఆధ్వర్యంలో మంగళవారం నల్గొండ జిల్లా కలెక్టరేట్‌ ఎదుట మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, గెజిటెడ్‌ అధికారులు, పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని ‘సీపీఎస్‌ రద్దు–ఓపీఎస్‌ అమలు’ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా టీజీఈజేఏసీ జిల్లా చైర్మన్‌ నాగిళ్ల మురళి మాట్లాడుతూ సీపీఎస్‌ విధానం ఉద్యోగుల పదవీ విరమణ అనంతర పెన్షన్‌ భద్రతకు ఇబ్బందికరంగా మారిందన్నారు....