మైనారిటీల హామీలు అమలు చేయాలి..జమియత్ ఉలేమా తెలంగాణ డిమాండ్.

చీకటి వెలుగు నల్లగొండ. : తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల సమయంలో మైనారిటీలకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని జమియత్ ఉలేమా ఎ హింద్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మౌలానా షా సయ్యద్ ఎహ్సానుద్దీన్ రషాదీ ఖాస్మీ డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని దారుల్ ఉలూమ్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు. 2023 ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రకటించిన మైనారిటీ సంక్షేమ హామీలను ఆలస్యం చేయకుండా అమలు చేయాలని కోరారు. ఆనాటి హామీలను నెరవేర్చకుండా మైనారిటీలపై సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని ఎద్దేవా చేశారు. మైనారిటీ ఉప ప్రణాళికను అమలు చేసి, మైనారిటీల కోసం ప్రకటించిన రూ.4,000 కోట్ల బడ్జెట్‌ను పారదర్శకంగా వినియోగించాలని విజ్ఞప్తి...