డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో మిగిలిన పనులు త్వరగా పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్
చీకటి వెలుగు నల్గొండ: నల్గొండలోని గొల్లగూడ డబుల్ బెడ్రూమ్ గృహ సముదాయంలో మిగిలి ఉన్న అన్ని పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి లబ్ధిదారులకు త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. గొల్లగూడ డబుల్ బెడ్రూమ్ గృహ సముదాయాన్ని పరిశీలించిన కలెక్టర్, ఇళ్లలో అద్దాలు, ఎలక్ట్రికల్ వైరింగ్, విండోలు, వాటర్ ట్యాంకులు, నీటి ట్యాపులు, లైటింగ్, తలుపులు, బాత్రూములు, టాయిలెట్లు, కిచెన్ గదులు తదితర పనులను పూర్తిస్థాయిలో పూర్తి చేయాలని సూచించారు. అలాగే గృహ సముదాయం మొత్తం పరిశుభ్రంగా ఉండేలా శుభ్రపరిచే చర్యలు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు. లబ్ధిదారులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక...