యాదాద్రిలో రూ.99.55 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపనచీకటి వెలుగు ప్రత్యేకం

యాదాద్రి భువనగిరి జిల్లాలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానంలో రూ.99.55 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఆలయ అనుబంధ అభివృద్ధి పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రూ.43.79 కోట్లతో వేద పాఠశాల నిర్మాణం, రూ.9.86 కోట్లతో కొండపై నిత్య కల్యాణ మండపం, రూ.1.41 కోట్లతో వైకుంఠ ద్వారం నుంచి కొండపైకి వెళ్లే మెట్ల మార్గానికి పైకప్పు నిర్మాణం, రూ.1.34 కోట్లతో రథశాల వైపు మాడవీధులకు మెట్లు, రూ.43.12 కోట్లతో దీక్షాపరుల సదనం నిర్మాణాలకు సీఎం శంకుస్థాపనలు చేశారు. ముందుగా కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి పర్యవేక్షణలో వేద మంత్రోచ్ఛారణల మధ్య వేద పాఠశాలకు భూమిపూజ నిర్వహించారు....