నల్గొండలో ఐటీఐ/ఐటీసీలో 6 స్వల్పకాలిక కోర్సుల ప్రారంభం

నల్గొండలోని బాలికల ఐటీఐ/ఐటీసీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆరు స్వల్పకాలిక కోర్సులను నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల కార్యాచరణ – ప్రజా పాలన & ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ కోర్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ యువత స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని తమ భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు. ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక ప్రజల అభివృద్ధి, యువత సాధికారత కోసం ప్రభుత్వ కట్టుబాటును ప్రతిబింబిస్తోందన్నారు. యువతలో నైపుణ్యాభివృద్ధి పెంపొందించి ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలనే లక్ష్యంతో ఈ స్వల్పకాలిక కోర్సులను ప్రారంభించడం అభినందనీయం...