హైదరాబాద్‌లో ‘ఎకాలజీ–డెమోక్రసీ–ఎకానమీ’ అంశాలపై రౌండ్ టేబుల్ సమావేశం

హైదరాబాద్‌లో ఎకాలజీ, డెమోక్రసీ, ఎకానమీ అంశాలపై మేధావులు, జర్నలిస్టులు, సామాజికవేత్తలతో కూడిన రౌండ్ టేబుల్ సమావేశంను శనివారం నిర్వహించారు. ఈ సమావేశాన్ని అడ్వకేట్, సామాజిక కార్యకర్త డా. లుబ్నా సర్వత్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెగసెసే అవార్డు విజేత ప్రొఫెసర్ సందీప్ పాండే, మాజీ ఎంపీ, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ (టీపీసీసీ ఇన్‌చార్జ్) మీనాక్షి నటరాజన్, కాశ్మీర్ జర్నలిస్టు షాహిద్ సలీం తదితరులు పాల్గొని ప్రసంగించారు. వక్తలు పర్యావరణ ధ్వంసం వల్ల ఏర్పడుతున్న తీవ్రమైన దుష్ఫలితాలపై ఆందోళన వ్యక్తం చేశారు. కాశ్మీర్‌లో పర్యావరణానికి జరుగుతున్న నష్టం, మైనింగ్ పేరుతో ఆరావళి పర్వతాల విధ్వంసం, వ్యర్థాల కారణంగా నదుల కలుషితం ద్వారా మానవాళికి కలుగుతున్న నష్టాన్ని...